అక్షరటుడే వెబ్‌డెస్క్: Mallikarjun Kharge purification row | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజు రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉత్తరాఖండ్‌లో తాను పాల్గొన్న ర్యాలీ ముగిసిన తర్వాత కొందరు వేదిక వద్ద శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టడంపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇటీవల ఉత్తరాఖండ్‌లోని రామ్‌లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. అయితే, ఆ కార్యక్రమం ముగిసిన రెండు రోజుల తర్వాత కొందరు ఆ వేదిక వద్ద శుద్ధి కార్యక్రమం నిర్వహించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని గురువారం రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే ఖర్గే సభ దృష్టికి తీసుకువచ్చారు.
Mallikarjun Kharge purification row | కించపరిచేలా మాట్లాడలేదు..
నేను మాట్లాడిన ర్యాలీకి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. నేను ఎక్కడా ఏ మతాన్ని, ఏ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడలేదు. కేవలం ప్రజల సమస్యల గురించే ప్రస్తావించాను. కానీ, నేను మాట్లాడిన స్థలంలో కొందరు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు ఉండాలా? ఇది కచ్చితంగా బీజేపీ కార్యకర్తల పనే’’ అంటూ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ ఘటనపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్.. ప్రపంచంలో అంటరానితనానికి మించిన పాపం మరొకటి లేదని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని పేర్కొంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
Mallikarjun Kharge purification row | బీజేపీ స్పందన..
మరోవైపు, బీజేపీ కార్యకర్తలే ఈ పని చేశారంటూ ఖర్గే చేసిన ఆరోపణలను కేంద్రమంత్రి జేపీ నడ్డా ఖండించారు. ఆ ఘటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఎప్పుడూ ఇలాంటి సంకుచిత కార్యక్రమాలను సమర్థించబోదని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపిస్తామని ఆయన సభకు హామీ ఇచ్చారు.
రాజ్యసభలో ఖర్గే, జేపీ నడ్డాల మధ్య తీవ్ర వాగ్వాదం.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే @kharge సభా నాయకుడు జేపీ నడ్డా @JPNadda మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
తనను అంటరానివాడిగా చూస్తూ అవమానిస్తున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేయగా, అలాంటి చర్యలను బీజేపీ ఏమాత్రం… pic.twitter.com/j2FQPyxO1c
— ఉదయం (@udayamdigital) August 13, 2026
ఇది కూడా చదవండి: Prakash Raj Vote | వీడియో పెడితేనే ఓటా?.. ఈసీ అధికారులపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం