Kamareddy Congress Protest | రేపు కామారెడ్డిలో కాంగ్రెస్ పాదయాత్ర, సత్యాగ్రహం

కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పాదయాత్ర, సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్​ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Congress Protest | కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పాదయాత్ర, సత్యాగ్రహం నిర్వహించనున్నట్లు డీసీసీ (Kamareddy Congress) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్​ పేర్కొన్నారు. హల్ద్వానీలో కాంగ్రెస్ ర్యాలీ జరిగిన ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధీ చేసిన ఘటనను ఖండిస్తూ శుక్రవారం సాయంత్రం ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

Kamareddy Congress Protest | ఖర్గేకు సంఘీభావంగా..

మల్లికార్జున్​ మాట్లాడుతూ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు (Mallikarjun Kharge) సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ పాదయాత్ర, సత్యాగ్రహాన్ని విజయవంతం చేయాలని కోరారు. మహాత్మా గాంధీ లేదా అంబేద్కర్ విగ్రహం వద్ద పాదయాత్ర అనంతరం సత్యాగ్రహం నిర్వహించి, వివక్ష, అంటరానితనం, రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తుందని చెప్పారు.

ఇది కూడా చదవండి: Banana Tree Vastu | ఇంటి ఆవరణలో అరటి చెట్టు నాటవచ్చా ?.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *