అక్షరటుడే, మెండోరా: Sriramsagar Project | శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం తగ్గిపోయింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో జలశయానికి ఇన్‌ఫ్లో తగ్గింది.
1,013 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriramsagar Project)లోకి 1,013 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1079.50 అడుగుల వద్ద 43.669 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 482 క్యూసెక్కులు నీళ్లు బయటకు వెళ్తున్నాయి.
ఇది కూడా చదవండి..: Nizamabad Hotel Checks | నగరంలోని హోటళ్లలో పోలీసుల తనిఖీలు.. అనుమానిత వ్యక్తులపై ఆరా..