అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Independence Day | స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా కేంద్రంలోని(Kamareddy) ఇందిరాగాంధీ క్రీడా ప్రాంగణంలో (Indira Gandhi Sports Ground) పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Kamareddy Independence Day | పోలీస్‌శాఖకు సంబంధించి..
పోలీసు శాఖకు సంబంధించిన ఏఆర్ సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఓ వైపు ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు చినుకులు పడుతుండటంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు.. వర్షం పడే అవకాశం ఉండటంతో కార్యక్రమం నిర్వహణ ఎలా సాగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఇందిరాగాంధీ క్రీడా ప్రాంగణంలో రోడ్డును పూర్తిగా చదును చేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే ప్రత్యేక స్టాల్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు జెండావిష్కరణ కార్యక్రమానికి బీసీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు వి.హన్మంత రావు హాజరు కానున్నారు. ఇవాళ రాత్రి వరకు ఆయన కామారెడ్డికి చేరుకోనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు స్టేడియంలో హన్మంత్ రావు చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ చేపట్టనున్నారు. అలాగే ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.