అక్షరటుడే, కామారెడ్డి: Rishwita Sailing Silver | సెయిలింగ్(Sailing) పోటీల్లో రిశ్విత చూపిన ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Shabbir Ali) కొనియాడారు. ఆదివారం కామారెడ్డి(Kamareddy) నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో రిశ్వితను సత్కరించి అభినందనలు తెలిపారు.
Rishwita Sailing Silver | అంతర్జాతీయ స్థాయిలో..
షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఇటలీలో జరిగిన పోటీల్లో రిశ్విత అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి రజతం సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. రిశ్విత సాధించిన ఈ అద్భుత విజయం తెలంగాణ యువతకు, ముఖ్యంగా క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకమని, పట్టుదల, కృషి, ప్రతిభతో అంతర్జాతీయ వేదికపై విజయాలు సాధించవచ్చని ఆమె నిరూపించిందని పేర్కొన్నారు. ఆమె భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ విజయాలు సాధించి దేశానికి మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆమె క్రీడా ప్రస్థానంలో అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటానని హామీ ఇచ్చారు. రిశ్విత మాట్లాడుతూ.. తనను సన్మానించి ప్రోత్సహించి ఆర్థిక సహాయం అందించిన షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేనీ సందీప్ కుమార్, సుదర్శన్, గోనె శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Karnataka CM DK Shivakumar | ఏ సంస్థ అయినా చట్టాన్ని పాటించాల్సిందే : కర్ణాటక సీఎం