అక్షరటుడే, ఎల్లారెడ్డి: PDS Rice Smuggling | ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని కామారెడ్డి Kamareddy జిల్లా నాగిరెడ్డిపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వారి నుంచి 29 సంచుల (సుమారు 14.5 క్వింటాళ్ల) పీడీఎస్ బియ్యంతో పాటు వాహనం, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
PDS Rice Smuggling | పక్కా సమాచారంతో నిఘా..
స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన తొగిట బాలరాజు (49), మింగారబోయిన యేసు (33) పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. శనివారం బూరుగుపల్లి నుంచి పోచారం మీదుగా లింగంపేట వైపు వెళ్తుండగా మాల్తుమ్మెద గేటు వద్ద ఎన్‌హెచ్-765డీ రోడ్డుపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో టీఎస్ 35 టీఏ 2486 నంబర్ గల అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. అందులో 29 సంచుల్లో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
Railway Engineer Bribe | రూ.15 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన రైల్వే ఇంజినీర్
మొత్తం సుమారు 14.5 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. బియ్యంతో పాటు వాహనాన్ని, అక్రమ కొనుగోలు, విక్రయాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
PDS Rice Smuggling | అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు..
నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎం. మదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు, విక్రయాలు లేదా తరలింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.