Jajala Surender Arrest | మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హౌస్​ అరెస్ట్​..

ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ను పోలీసులు హౌస్​ అరెస్ట్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Jajala Surender Arrest | ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ను పోలీసులు హౌస్​ అరెస్ట్​ చేశారు. కామారెడ్డి (Kamareddy)లోని ఆయన స్వగృహంలో పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Jajala Surender Arrest | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ నిలిపేశారని ఆరోపిస్తూ..

జాజాల మాట్లాడుతూ..పేద బిడ్డలకు ఆసరాగా ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. దీనిని నిరసిస్తూ లింగంపేట పట్టణంలోని అంబేడ్కర్​ చౌరస్తాలో సోమవారం భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామన్నారు. అయితే శాంతియుతంగా ధర్నా చేసేందుకు నిర్ణయిస్తే పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేయడం ఎంత వరకు సమంజసమని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు.

Jajala Surender Arrest | ప్రశ్నించే గొంతుకలంటే ఎందుకు భయం..

పథకాల అమలును నిలిపివేశారని నిరసిస్తూ ధర్నా చేయడం కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో నేరంగా పరిగణిస్తున్నారని జాజాల ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల తరపున నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా కాంగ్రెస్​ హయాంలో లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తాము ఈ నిరసన కార్యక్రమం తలపెట్టామన్నారు. పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక చేయూతనిచ్చే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి..: PDS Rice Smuggling | పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్టు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *