Gandhari BRS Protest | గాంధారిలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా

గాంధారిలోని బాన్సువాడ– కామారెడ్డి ప్రధాన రహదారిపై బీఆర్​ఎస్​ నాయకులు ధర్నా నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Gandhari BRS Protest | మండల కేంద్రంలోని  బాన్సువాడ – కామారెడ్డి (Kamareddy) ప్రధాన రహదారిపై బీఆర్​ఎస్​ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఎం డౌన్​ డౌన్​ అంటూ నినాదాలు చేశారు.

Gandhari BRS Protest | ఆ​ పథకాలను​ నిలిపివేయొద్దు

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల లింగంపేటలో ధర్నా చేస్తామని పిలుపునివ్వడంతో ఆయనను కామారెడ్డిలోనే పోలీసులు హౌస్​ అరెస్ట్​ చేశారు.  దీంతో బీఆర్​ఎస్​ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధారి మండలంలో ధర్నాకు దిగారు. దీంతో గంటసేపు  రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Jajala House Arrest | కామారెడ్డిలో ఉద్రిక్తత.. జాజాల హౌస్ అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *