అక్షరటుడే వెబ్డెస్క్: Rahul Gandhi Supreme Court | కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు జరపాలంటూ అలహాబాద్ హైకోర్టు ( Allahabad High Court )ఇచ్చిన ఆదేశాలపై సోమవారం సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసులో ఎటువంటి దర్యాప్తు నివేదికలను హైకోర్టుకు లేదా ఇతర సంస్థలకు సమర్పించవద్దని సీబీఐ, ఈడీలను ఆదేశించింది. అలాగే, అలహాబాద్ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణను నిలిపివేయాలని సూచించింది.
Rahul Gandhi Supreme Court | సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా నేరం జరిగినప్పుడు దర్యాప్తు సంస్థలు చట్టప్రకారం ముందుకు వెళ్లవచ్చని, కానీ సంబంధిత వ్యక్తికి కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా హైకోర్టు ఎలా ఆదేశాలు జారీ చేస్తుందని ప్రశ్నించింది. అంతేకాకుండా, ఈ కేసు విషయంలో దర్యాప్తు సంస్థలకు ఎందుకంత ఆసక్తి అని కోర్టు నిలదీసింది.
కర్ణాటకకు చెందిన విఘ్నేష్ శిశిర్ అనే వ్యక్తి రాహుల్ గాంధీపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు సీబీఐ, ఈడీ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Jajala House Arrest | కామారెడ్డిలో ఉద్రిక్తత.. జాజాల హౌస్ అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం