అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ravindra Jadeja | టెస్టుల్లో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు 350 వికెట్లు తీశాడు. శ్రీలంక (Srilanka)తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆయన ఈ రికార్డు సాధించాడు. 350 టెస్ట్ వికెట్లు తీసిన ఐదో భారత్ బౌలర్‌గా జడేజా నిలిచాడు. జడేజా 92 టెస్టుల్లో 351 వికెట్లు తీశాడు.
శ్రీలంక టెస్టుల్లో భారత బౌలర్లు విజృంభించారు. ఆది నుంచి మ్యాచ్‌పై పట్టు బిగించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 284 పరుగులకు ఆలౌట్ అయింది. 178 పరుగుల ఆధిక్యంలో భారత్ నిలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది.
Ravindra Jadeja | మానవ్‌కు 4 వికెట్లు
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో తొలి సెషన్లో లంక 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే సోనల్ దినుష, నిరోషన్ డిక్వలే 146 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు. దినుష సెంచరీతో రాణించాడు. నిరోషన్ 80 పరుగులు చేశాడు. వీరి భాగస్వామ్యాన్ని ప్రిసిద్ కృష్ణ విడగొట్టాడు. 236 పరుగుల వద్ద నిరోషన్ను ఔట్ చేశాడు. అనంతరం మిగతా వారు సైతం త్వరగా వికెట్ కోల్పోయారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ (Manav Suthar) 4 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా (Ravindra Jadeja) 3 వికెట్లు తీశారు. సిరాజ్, ప్రసిద్, కులదీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.
Jaisu, kya sahi time pe uthe ho! 😂
A bizarre deflection off Jaiswal, a simple catch for Shubman, and Jadeja has his 350th Test wicket!
Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/B9O0jR61uB
— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026
దీనిని కూడా చదవండి : Telangana POB Lands | పీవోబీ సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం: మంత్రి పొంగులేటి