Sarvai Papanna Goud | బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన ధీరత్వానికి ప్రతీక అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Sarvai Papanna Goud | సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన ధీరత్వానికి ప్రతీక అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద విగ్రహాల పార్క్​లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Sarvai Papanna Goud | ఏకమై పోరాడాలి

సర్దార్ సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో బహుజనులు అందరి ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలని నరాల సుధాకర్​ పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే బీసీ కులాలు అన్ని ఏకమై పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల ప్రసాద్, ధర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, చంద్రకాంత్, శ్రీలత, ఆర్టీసీ శ్రీనివాస్, సాయి బసవ, జయ, అనిల్, సత్యనారాయణ, గంగాధర్, నరహరి తదితరులు పాల్గొన్నారు.

Sarvai Papanna Goud | బాల్కొండలో..

Sarvai Papanna Goud

బాల్కొండ మండల (Balkonda Mandal) కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధ్యక్షుడు లింగాగౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడని కొనియాడారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, మల్లేష్ గౌడ్, ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Lingampet Husband Attack | భర్త ఘాతుకం.. భార్యపై అర్ధరాత్రి కత్తితో దాడి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *