నిజామాబాద్Fee Reimbursement | రీయింబర్స్​మెంట్​ బకాయిలను వెంటనే విడుదల చేయాలి..

Fee Reimbursement | రీయింబర్స్​మెంట్​ బకాయిలను వెంటనే విడుదల చేయాలి..

రీయింబర్స్​మెంట్​ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్​ఎస్​వీ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Fee Reimbursement | రీయింబర్స్​మెంట్​ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీఆర్​ఎస్​వీ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ (Additional Collector)​కు వినతిపత్రం అందజేశారు.

Fee Reimbursement | ప్రజావాణిలో..

బీఆర్​ఎస్​వీ నాయకులు కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం అందించారు. అనంతరం బీఆర్​ఎస్​వీ నగర కార్యదర్శి మధుకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గాడనిద్ర నుంచి బయటకు వచ్చి ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని త్వరగా నిధులు విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి ఈ ప్రభుత్వం దగ్గర నిధులున్నాయి కానీ.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్​ చెల్లించడానికి మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. ఎన్నికల్లో భాగంగా గ్రీన్​ఛానల్ తీసుకొచ్చి ఒకేసారి ఫీజు బకాయిలను విడుదల చేస్తామని హామీలిచ్చి విద్యార్థి లోకాన్ని నమ్మించి కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) మోసం చేస్తోందన్నారు. బకాయిలు విడుదల చేయకపోతే తీవ్రమైన పరిమాణాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Pan Shop Cases | పాన్​షాప్​లపై కేసుల నమోదు..

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....