అక్షర్ టుడే, నందిపేట: Sarvai Papanna Goud | హైదరాబాద్ Hyderabad నగరంలో వైభవంగా నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నందిపేట గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి నివాళులర్పించారు.
Sarvai Papanna Goud | పోరాట స్ఫూర్తి ఎప్పటికీ ఆదర్శం
ఈ సందర్భంగా గౌడ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. బహుజనుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఆయన త్యాగాలు, పోరాట స్ఫూర్తి సమాజానికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠాపనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ నందిపేట గౌడ సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సమాజ అభ్యున్నతికి ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నందిపేట గౌడ సంఘం ముఖ్య నాయకులు ఉల్లి సుధాకర్ గౌడ్, ఉల్లి ప్రభాకర్ గౌడ్, ఉల్లి అశోక్ గౌడ్, ఉల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రసాద్ గౌడ్, సత్య గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, గజ్జ గౌడ్, కిష్ట గౌడ్, నందేవ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బోజా గౌడ్, ఎల్ల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.