అక్షరటుడే, వెబ్‌డెస్క్: Konda Sushmita Politics | మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఆమె ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పలువురు పార్టీ నేతలు ఆమె వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.
కొండా సుష్మిత సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ఆయన సోదరులపై ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటిని సైతం విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. వర్దన్నపల్లి ఎమ్మెల్యే నాగరాజు సుష్మిత వ్యాఖ్యలను ఖండించారు. సీఎం గురించి మాట్లాడే స్థాయి ఆమెకు లేదన్నారు. తాజాగా గాంధీ భవన్లో కాంగ్రెస్ మహిళా నేత ఇందిరా శోభన్ మాట్లాడుతూ.. పార్టీ లైన్ దాటి సీఎంను విమర్శించే అధికారం ఎవరిచ్చారు అని సుష్మితను ప్రశ్నించారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడి చులకన కావొద్దని హితవు పలికారు. తల్లిదండ్రుల పెంపకాన్ని ప్రశ్నించేలా మాట్లాడొద్దని, తల్లిదండ్రుల చాటున రాజకీయం చేస్తున్న ఆమెకు సీఎంను అనే హక్కు ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Konda Sushmita Politics | ఇంట్లో అందరికీ పదవులు కావాలా..
సుష్మిత పార్టీలో ఉందా అని ఇందిర ప్రశ్నించారు. వారి ఇంట్లో అందరికీ పదవులు కావాలా అన్నారు. సినిమా డైలాగులు కొట్టడం సింపుల్ అని, తన అక్క కూతురు కాబట్టి గౌరవం ఇస్తున్నా అన్నారు. ఆమె వ్యాఖ్యలతో పక్క పార్టీలు ట్రోల్ చేస్తున్నాయని పేర్కొన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి అవినీతి బయటపెట్టాలని ఆమెకు సవాల్ చేశారు. సుష్మిత చేసే వ్యాఖ్యలకు ఆమె తల్లి తల దించుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ సుష్మితతో మాట్లాడిస్తున్నాయని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: PCC Chief Mahesh Goud | పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు : పీసీసీ చీఫ్