అక్షరటుడే, వెబ్‌డెస్క్: New York Shooting | న్యూయార్క్ నగరంలో ఓ దుండగుడు జరిపిన కాల్పులో భారీతీయుడు మృతి చెందాడు. పంజాబ్‌కు చెందిన సిక్కు వలసదారుడైన గుర్దీప్ సింగ్(27)ను ఈస్ట్ న్యూయార్క్ పరిసర ప్రాంతంలోని స్టాన్లీ అవెన్యూ సమీపంలో దుండగుడు కాల్చి చంపినట్లు ‘పీటీఐ’ నివేదించింది.
New York Shooting | పిజ్జా డెలివరీ విషయంలో వాగ్వాదం
పిజ్జా డెలివరీ విషయంలో జరిగిన వాగ్వాదం అనంతరం దుండగుడు భారతీయుడిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇద్దరు వ్యక్తులు గొడవ పడడం.. ఆ తర్వాత తుపాకీ కాల్పుల వల్ల యువకుడు మృతి చెందినట్లు నిఘా కెమెరాలో రికార్డయినట్లు తెలుస్తోంది. ఒక వ్యక్తి నేలపై పడిపోగా, మరొక వ్యక్తి కారు ఎక్కి పారిపోయినట్లు ఆ నివేదిక పేర్కొంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
New York Shooting | ఘటనపై ‘నాపా’ తీవ్ర విచారం
గుర్దీప్ సింగ్ హత్యపై నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (నాపా) తీవ్ర విచారం, ఆగ్రహం వ్యక్తం చేసింది. NAPA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చహల్ ‘X’లో పోస్ట్ చేశారు. “ఒక యువ పంజాబీ హత్యకు గురైన ప్రతిసారి, మరో కుటుంబం నాశనమవుతుంది. పదేపదే జరిగే హింసతో సమాజం సర్దుకుపోవడాన్ని మనం అనుమతించలేం,” అని చహల్ పేర్కొన్నారు.
Press Statement for immediate release
———————————————–Enough Is Enough — How Many More Punjabi and Sikh Lives Must Be Lost Before America Acts? Rude NAPA
August 23, 2026- The North American Punjabi Association (NAPA) expresses profound grief and… pic.twitter.com/ArrpLzArga
— Editor-Satnam Singh Chahal (@Indousmedia) August 23, 2026
ఇది కూడా చదవండి..: IND vs SL 2nd Test | ఇండియా – శ్రీలంక రెండో టెస్ట్.. అద్భుత సెంచరీతో చెలరేగిన దేవదత్ పడిక్కల్