Chain Snatching | బస్టాండ్​లో చైన్​స్నాచింగ్.. ఇద్దరు మహిళల నగలు మాయం

ఉమ్మడిజిల్లాలో చైన్​ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Chain Snatching | ఉమ్మడిజిల్లాలో చైన్ స్నాచర్లు పేట్రేగిపోతున్నారు. రోడ్డుపైన, బస్టాండ్లలో మహిళలను టార్గెట్​ చేస్తూ ఆభరణాలు లాక్కెళ్తున్నారు.

Chain Snatching | ఎల్లారెడ్డి బస్టాండ్​లో..

​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి (Yellareddy) బస్టాండ్​లో ఆదివారం సాయంత్రం ఇద్దరు మహిళల మెడలోని బంగారు గుండ్లను దొంగలు మాయం చేశారు. లింగంపేట్ మండలం భవానీపేట్​కు చెందిన నాగులూరి సుశీల భవానీపేట్ వెళ్లేందుకు బస్సు ఎక్కిన తర్వాత తన మెడలో ఉన్న సుమారు 1.5 తులాల బంగారు గుండ్లు కనిపించకపోవడాన్ని గుర్తించారు. అదేవిధంగా ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట్ గ్రామానికి చెందిన కుసులకంటి దీవెన బాన్సువాడ బస్సు ఎక్కిన అనంతరం తన మెడలోని సుమారు 1.5 తులాల బంగారు గుండ్లు పోయినట్లు గుర్తించి వెంటనే ఎల్లారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Revenue Conclave | నిజామాబాద్ రెవెన్యూ కాంక్లేవ్‌లో ఉద్యోగుల ఐక్యతకు ప్రాధాన్యం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *