అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Losses | పశ్చిమాసియాలో సంక్షోభం కొనసాగుతోంది. ఇరాన్‌పై చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు.
దీనిపై ఈరోజు సాయంత్రం అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ విలేకరుల సమావేశంలో ప్రకటన వెలువరించే అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రతిస్పందనగా ఆర్థిక యుద్ధం కొనసాగితే గల్ఫ్ నుంచి అన్ని చమురు ఎగుమతులను నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఒత్తిడికి గురవుతున్నాయి.
Stock Market Losses | లాభాలతో ప్రారంభమైనా..
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 89 పాయింట్ల గ్యాప్ అప్‌లో ప్రారంభమై మరో 160 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి ప్రాఫిట్ బుకింగ్‌తో 484 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో మొదలై మరో 28 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 140 పాయింట్లు పతనమైంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 199 పాయింట్ల లాభంతో 77,341 వద్ద, నిఫ్టీ 59 పాయింట్ల లాభంతో 24,192 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 8 స్టాక్స్ లాభాలతో, 22 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. టాటా స్టీల్ 1.23 శాతం, ఇన్ఫోసిస్ 1.21 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.99 శాతం, సన్‌ఫార్మా 0.94 శాతం, టెక్ మహీంద్రా 0.51 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : బీఈఎల్ 1.21 శాతం, ఆదానీపోర్ట్స్ 1.06 శాతం, పవర్‌గ్రిడ్ 1.01 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.99 శాతం, ఐటీసీ 0.98 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Aug 04 Gold Prices | దేశీయ బులియన్ మార్కెట్‌లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు