అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోంది. ఏ శాఖలో చూసినా లంచాలు తీసుకునే అధికారులకు కొదవ లేకుండా పోయింది. ఏసీబీ దాడులు చేస్తున్నా.. అవినీతి అధికారులు మారడం లేదు.
నిర్మల్ (Nirmal) సర్కిల్ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ కొప్పెల గోదావరి, సీనియర్ అసిస్టెంట్ సాయి కృష్ణ లంచం తీసుకుంటుండగా ఏసీబీ (ACB) వల పన్ని పట్టుకుంది. మంచిర్యాల పట్టణానికి చెందిన వ్యాపారవేత్త లక్కింశెట్టి వీర భాస్కర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ACB Raid | ఆడిట్ నివేదిక కోసం..
భాస్కరరావుకు చెందిన లక్ష్మీ ప్రసన్న జ్యువెలర్స్ 2022-23, 2023-24 రికార్డుల ఆడిట్ విషయంలో అధికారికంగా సహాయం చేసినందుకు ట్యాక్స్ ఆఫీసర్ (Tax Officer) గోదావరి రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదిదారుడు పదేపదే చేసిన అభ్యర్థనల మేరకు, ఆ మొత్తాన్ని రూ.90 వేలు, రూ.80 వేలుకు తగ్గించారు. మరియు చివరకు రూ.50 వేలు తీసుకోవడానికి అంగీకరించారు. వ్యాపార రికార్డులకు సంబంధించి అనుకూలమైన ఆడిట్ నివేదికను జారీ చేయడం ద్వారా తక్కువ పన్ను విధించదగిన టర్నోవర్/జీఎస్టీ బాధ్యతను చూపించడానికి ఈ మొత్తం అడిగారు. ఈ మేరకు సోమవారం ఫిర్యాదుదారుడి నుంచి ట్యాక్స్ ఆఫీసర్ గోదావరి రూ.50 వేలు తీసుకున్నారు. అనంతరం ఆ డబ్బును సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణకు అందజేశారు. నిందితులు ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
దీనిని కూడా చదవండి : RI Caught by ACB | భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఆర్ఐ, జీపీవో