Former Sarpanch Murder | వర్నిలో కలకలం.. మాజీ సర్పంచ్​ దారుణ హత్య

వర్ని మండలం తగిలేపల్లి మాజీ సర్పంచ్​ వెంకటేశ్​ దారుణ హత్యకు గురయ్యాడు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Former Sarpanch Murder | మాజీ సర్పంచ్​ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వర్ని మండలంలో కలకలం రేపింది.

Former Sarpanch Murder | తగిలేపల్లి గ్రామంలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని మండలం (Varni Mandal)లోని తగిలేపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్​ మైసమ్ వెంకటేష్ అలియస్​ వెంకన్న(55)కు.. అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బక్క నారాయణకు భూ వివాదం ఉంది. వీరు ఇద్దరు సర్వే నంబర్​ 392లో సాగు చేస్తున్నారు. అయితే ఈ సర్వేనంబర్​లో వెంకన్న ఆరు ఎకరాల్లో సాగు చేస్తుండగా.. బక్క నారాయణ రెండెకరాల్లో పంట పండిస్తున్నారు. అయితే తనకు మరో రెండు ఎకరాలు ఇవ్వాలని నారాయణ.. ఇచ్చేది లేదని వెంకన్న తరచూ గొడవ పడేవారు. ఈ విషయమై సోమవారం ప్రజావాణిలో సైతం నారాయణ ఫిర్యాదు చేశాడు. సోమవారం సాయంత్రం పొలం వద్ద వీరిద్దరికి మరోసారి గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బక్క నారాయణ వెంకన్నను గొడ్డలితో నరికి హత్య చేశాడు. అనంతరం మంగళవారం ఉదయం 5.30గంటలకు వర్ని పోలీస్​స్టేషన్​లో లొంగిపోయాడు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Rice Millers Vigilance Raids | రైస్ మిల్లులపై విజిలెన్స్ పంజా.. రెండు రైస్ మిల్లర్ల యజమానుల అరెస్ట్..?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *