Stock Market Losses | నష్టాలు కంటిన్యూ..

దేశీయ స్టాక్ మార్కెట్లో నష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 168 పాయింట్లు, నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Losses | పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. టెహ్రాన్ ఆర్థిక జీవనాధారాన్ని దెబ్బతీయడం కోసం అమెరికా ఆర్థిక ఆంక్షలు విధిస్తుండగా.. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లు నెగెటివ్‌గా కొనసాగుతుండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల బాటలో సాగుతున్నాయి.

Stock Market Losses | న్యారో రేంజ్‌లో..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం న్యారో రేంజ్‌లో కొనసాగుతోంది. ఉదయం సెన్సెక్స్ 74 పాయింట్ల గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై అక్కడినుంచి 95 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి ప్రాఫిట్ బుకింగ్‌తో 265 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 44 పాయింట్ల నష్టంతో మొదలై 23 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 83 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 168 పాయింట్ల నష్టంతో 77,200 వద్ద, నిఫ్టీ 78 పాయింట్ల నష్టంతో 24,140 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 7 స్టాక్స్ లాభాలతో, 23 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్ 0.74 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.35 శాతం, ఎస్బీఐ 0.24 శాతం, ఆదానీపోర్ట్స్ 0.18 శాతం, టైటాన్ 0.11 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : హెచ్సీఎల్ టెక్ 1.49 శాతం, టెక్ మహీంద్రా 1.08 శాతం, టాటా స్టీల్ 0.99 శాతం, మారుతి 0.78 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.79 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Lava Virat V1 Pro | లావానుంచి మరో బడ్జెట్ ఫోన్..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *