అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Indiramma Houses Construction | జిల్లాలో (Nizamabad) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, రెండు పడక గదుల కేటాయింపుపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు.
Indiramma Houses Construction | అర్హులకే కేటాయిస్తున్నాం..
రెండు పడక గదుల ఇళ్ళను అర్హులైన వారికి కేటాయించడం జరుగుతోందని కలెక్టర్ గుర్తు చేశారు. ఇంకా అర్హుల జాబితాను ఖరారు చేయని ఆయా మండలాల అధికారులు తక్షణమే లాటరీ విధానం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితా రూపొందించాలని, పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్నిచోట్ల డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, ప్రస్తుత పరిస్థితి, మిగిలి ఉన్న పనులు, అవసరమైన మరమ్మతులకు సంబంధించిన వివరాల గురించి కలెక్టర్ మండలాల వారీగా అడిగి తెలుసుకున్నారు.
కేటాయింపులకు సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి వచ్చేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్వో గీత, నిజామాబాద్, బోధన్ ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయ కుమారి, హౌసింగ్ డీఈలు గంగాధర్, రాజ్యలక్ష్మి, ఏఈ నివర్తి, అన్ని మండలాల తహశీల్దార్లు, హౌసింగ్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం..! మరి రాఖీ కట్టొచ్చా..? లేదా..?