అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Wedding Ceremony | రాజకీయ నాయకులు సాధారణంగా సభలు, సమావేశాల ద్వారా ప్రజలకు చేరువవుతుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత ఆత్మీయతకు ప్రాధాన్యమిచ్చి కుటుంబ సభ్యుడిగా మారిపోతుంటారు. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఒక పార్టీ నాయకుడి కోరిక మేరకు కుటుంబ సభ్యురాలిగా మారి వివాహ వేడుకను దగ్గరుండి ఘనంగా జరిపించారు. ఈసీఐఎల్ కీసర క్రాస్ రోడ్డులోని ఆరాధ్య కన్వెన్షన్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది.
Kavitha Wedding Ceremony | ఆచారం ప్రకారం ..
యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడిగా, తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పనిచేశారు. ఆయనకు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయమైంది. బుధవారం ఉదయం ఈ వివాహ వేడుక జరగాల్సి ఉండగా, తనకు అక్కాచెల్లెళ్లు లేరని భావించిన బాలప్రసాద్ కోరిక మేరకు కవిత వారి ఇంటి ఆడబిడ్డలా వ్యవహరించారు.
ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచు పసుపు కొమ్ముతో మూడు ముళ్లు వేయాలి. ఈ సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని, వధువు శివాని మెడలో పసుపు కొమ్ము దారంతో మూడు ముళ్లు వేశారు. అనంతరం వధువు ఉంగరపు వేలుకు ఉంగరం తొడిగి, ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను మనసారా ఆశీర్వదించారు. ఆ తర్వాత వరుడు బాలప్రసాద్ శివాని మెడలో మంగళసూత్రం ధారణ చేశారు.
ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత
ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత
తెలంగాణ రక్షణ సేన నాయకుడు, తెలంగాణ జాగృతి నేత బాషబోయిన బాలప్రసాద్ వివాహం కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్ష
తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో ఇంటి ఆడబిడ్డగా ఉండి… pic.twitter.com/1tpupLKLZ2
— RTV (@RTVnewsnetwork) August 26, 2026
ఇది కూడా చదవండి: Model School Teachers | ప్రభుత్వ తీరుతో ఉపాధ్యాయుల ఇబ్బందులు : హరీశ్‌రావు