అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kiran Rijiju Amit Shah | కేంద్ర హోంమంత్రి అమిత్ షా Amit Shah ఎప్పుడూ పెల్లెట్ ఫైరింగ్‌కు ఆదేశాలు ఇవ్వలేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. పోలీసులు చట్ట ప్రకారం తమ విధులను నిర్వర్తించారని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ప్రతిపక్షాలు పదేపదే అడ్డంకులు సృష్టించాయని రిజిజు ఆరోపించారు. సభలో ప్రతిపక్ష సభ్యులు అనుచితంగా ప్రవర్తించారని, పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే తమ బాధ్యత అన్నట్టుగా కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరించారని విమర్శించారు.
Kiran Rijiju Amit Shah | అడ్డుకోవడం సరికాదు..
పార్లమెంట్‌లో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను చర్చించేందుకు పార్లమెంట్ వేదికగా ఉండాలని, సభ సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని రిజిజు పేర్కొన్నారు.
Nepal Floods | నేపాల్ వరదల్లో 105 మంది భారతీయుల గల్లంతు
అమిత్ షా పెల్లెట్ ఫైరింగ్‌కు ఆదేశాలు ఇచ్చారనే ఆరోపణలను ఆయన ఖండిస్తూ, పోలీసుల చర్యలు చట్ట నిబంధనలకు అనుగుణంగానే జరిగాయని వెల్లడించారు.