Nepal Floods Control Room | నేపాల్ వరదలు.. కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

నేపాల్ వరదల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కంట్రోల్​ రూమ్​లను ఏర్పాటు చేశాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Floods Control Room | నేపాల్​లో బుధవారం వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వరదల్లో 400 మందికి పైగా గల్లంతు అయ్యారు. ఇప్పటి వరకు అధికారులు పలువురి మృతదేహాలను వెలికితీశారు. ఈ వరదల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సైతం గల్లంతు అయ్యారు. దీంతో ప్రభుత్వం అలర్ట్​ అయింది.

నేపాల్‌లో ఆకస్మిక వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన (ఎన్‌ఆర్‌ఐ) శాఖ హైదరాబాద్‌ (Hyderabad)లోని సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. నేపాల్‌లోని వరదల వల్ల ప్రభావితమైన తెలంగాణకు చెందిన వ్యక్తుల కుటుంబాలకు అవసరమైన సమాచారం, సహాయం అందించడం, సమన్వయం కోసం దీనిని ఏర్పాటు చేశారు. సమాచారం లేదా సహాయం కోసం ఎస్. లక్ష్మీనారాయణ (ప్రభుత్వ సహాయ కార్యదర్శి) 9885371189, కె. శ్రీనివాస్ రెడ్డి (సెక్షన్ ఆఫీసర్): 7997959754, ఇ. చిట్టిబాబు (సెక్షన్ ఆఫీసర్): 9440854433 నంబర్లలో సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.

Nepal Floods Control Room | ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

నేపాల్‌ వరదలపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఢిల్లీ ఏపీభవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 011-23384016, 23387089, వాట్సాప్‌ నెంబర్‌ 9059824101. వరదల్లో చిక్కుకున్న ఏపీ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఇది కూడా చదవండి..: Telangana Rain Alert | రైతులకు అలర్ట్​.. నేటి నుంచి తగ్గనున్న వర్షాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *