అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: NSUI Leader Wedding | సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) ఆయన నివాసంలో ఎన్ఎస్యూఐ (NSUI) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
NSUI Leader Wedding | తన వివాహానికి రావాలని ఆహ్వానం..
ఈనెల 30వ తేదీన నిజామాబాద్ నగరంలో జరగనున్న తన వివాహ వేడుకకు హాజరై, ఆశీర్వదించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వరదబట్టు వేణురాజ్ శుభలేఖను అందజేశారు. అనంతరం వేణురాజ్ మాట్లాడుతూ.. ప్రజా సేవలో నిరంతరం బిజీగా ఉండే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెళ్లి పత్రికను అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సీఎం తమ వివాహ మహోత్సవానికి హాజరై తమను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: కొండా కుటుంబం ఎటువైపు? కీలక రాజకీయ పరిణామంపై ఆసక్తికర చర్చ!