అక్షరటుడే, బాన్సువాడ: Rakhi Festival | రాఖీ పండుగ (Raksha Bandhan) తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలను ఇనుమడింపేజేసే ఈ పండుగను ఉమ్మడిజిల్లాలో ఘనంగా నిర్వహించుకున్నారు.
Rakhi Festival | ఆత్మీయ రక్ష..
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) ఆయన అక్క దొడ్ల సత్యవతి రాఖీ కట్టి ఆశీర్వదించారు. బాన్సువాడలోని తన నివాసంలో అన్నా–చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా–తమ్ముళ్ల ఆప్యాయతకు ప్రతీకగా రక్షాబంధన్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. రాఖీ పండుగ ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, ఆత్మీయతలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. అక్కా–తమ్ముళ్ల అనుబంధం, అన్నా–చెల్లెళ్ల ఆత్మీయత ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమిని ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఘనంగా జరుపుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
Rakhi Festival | ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు..
రక్షాబంధన్ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బ్రహ్మకుమారి స్వప్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో సందడిగా మారింది. బీడీ కార్మికులు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు, చిన్నారులు సైతం ఎమ్మెల్యేకు రాఖీకట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరికీ ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్నాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన కొండా సురేఖ..