అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ganja Chocolates | హైదరాబాద్ (Hyderabad) నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. తాజాగా పోలీసులు 5 వేలకు పైగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పిల్లలు, యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు శామీర్‌పేటలోని ఓ పాన్ షాప్‌పై దాడి చేశారు. ఈ దాడిలో గంజాయి చాక్లెట్లు లభించాయి. పాన్ షాప్ ద్వారా ఈ చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు, పిల్లలు, యువతను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గంజాయి చాక్లెట్ల విక్రయం మరియు సరఫరాలో ప్రమేయం ఉన్నవారిని గుర్తించడానికి, అలాగే ఈ నిషేధిత సరుకు ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Ganja Chocolates | యథేచ్ఛగా దందా
హైదరాబాద్ నగరంలో గంజాయి దందా జోరుగా సాగుతోంది. ఇన్ని రోజులు యువత, కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా దందా సాగగా.. తాజా పాఠశాల విద్యార్థులకు గంజాయి అమ్మతున్నట్లు తెలిసింది. చాక్లెట్ల ముసుగులో విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్నారు. వీటిని తీసుకుంటున్న విద్యార్థులు, యువత బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మిఠాయిల ముసుగులో మాదకద్రవ్యాల విక్రయాలను అరికట్టేందుకు శామీర్‌పేట, పరిసర ప్రాంతాల్లోని దుకాణాలపై పోలీసులు తనిఖీలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad Metro Services | మెట్రో సేవలకు అంతరాయం