అక్షరటుడే, వెబ్‌డెస్క్: Konda Surekha Action | శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో మార్పు కనిపించాలన్నారు. శనివారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.
కొండా సురేఖ అంశంలో చర్యలు తీసుకుంటేనే బెటర్ అని సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) అన్నారు. ఆ కుటుంబంపై చర్యలు తీసుకోవడానికి రెండు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆమెపై వేటు వేయడం, మంత్రి శాఖలను పునర్వ్యవస్థీకరణ రెండు అవకాశాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తుందని, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. లంబాడా, యాదవ్, మున్నూరుకాపులకు మంత్రి పదవుల్లో అవకాశం ఇవ్వాలని సూచించారు. అప్పుడే అసంతృప్తి నేతలకు చెక్ పెట్టినట్టు ఉంటుందన్నారు.
Konda Surekha Action | చేయాల్సింది చాలా ఉంది
ప్రజలకు చేయాల్సింది ఇంకా చాలా ఉందని మండలి ఛైర్మన్ అభిప్రాయ పడ్డారు. ఉచిత పథకాలు అసలైన లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. పెన్షన్ పెంచాలని, ఉద్యమకారులకు న్యాయం చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు తగ్గించాలన్నారు. చిన్నారెడ్డికి మంచి అవకాశం ఇచ్చిందని, ఆయన అలా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో అనేక ద్వారాలు ఉన్నాయని, ఎవరు ఏ విండోలో ఉంటారో తెలియదన్నారు.
Konda Surekha Action | సీఎంపై అసంతృప్తి
సీఎం రేవంత్‌రెడ్డిపై క్యాడర్ అసంతృప్తి ఉందని సుఖేందర్ రెడ్డి అన్నారు. సాధారణ ప్రజలు సంతృప్తికరంగానే ఉన్నారన్నారు. ఆయనను పని చేసుకోనివ్వాలన్నారు. 22ఏ ను రద్దు చేయాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Tree Dispute | వేప చెట్టు కోసం గొడవ.. ఇద్దరి మృతి