అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Assembly Sessions | తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసన సభ, శాసన మండలి కార్యదర్శులు సభ్యులకు అధికారికంగా సమాచారం అందించారు.
తెలంగాణ శాసనసభ కార్యవిధాన నియమావళిలోని 16వ నియమం రెండవ నిబంధన కింద తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించి స్పీకర్ (Speaker) సమావేశాలను నిర్వహించనున్నారు. 7న ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం అవుతుంది. సమావేశానికి సభ్యులు హాజరు కావడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి రెడ్ల తిరుపతిరెడ్డి అధికారులను ఆదేశించారు.
Telangana Assembly Sessions | కీలక అంశాలపై చర్చ
వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశం ఉంది. 22ఏ నిషేధిత జాబితా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ (BRS) సభలో లెవనెత్తనుంది. అంతేగాకుండా గోదావరి, కృష్ణా జలాలపై చర్చకు డిమాండ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేసీ సభ్యులు డిమాండ్ చేయనున్నారు. అధికార పార్టీ సైతం ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్ధం అవుతోంది. ఎన్ని రోజులు సభ నిర్వహిస్తామనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. బీఏసీ సమావేశం అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
దీనిని కూడా చదవండి : Illegal Buildings | అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.. 19 భవనాల కూల్చివేత