అక్షరటుడే, ఎల్లారెడ్డి: Madan Mohan Rao Attack | కామారెడ్డి kamareddy జిల్లా ఎల్లారెడ్డి Yellareddy ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు పర్యటనలో చోటుచేసుకున్న ఉద్రిక్తత ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది.
పోలీసుల సమక్షంలోనే ఎమ్మెల్యేపై దాడికి యత్నించారన్న ఆరోపణలతో 13 మంది మల్కాపూర్ గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం కలకలం రేపింది. అయితే ఈ కేసులో అరెస్టైన వారికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో అధికార, ప్రతిపక్ష వర్గాల మధ్య విమర్శలు మరింత ముదురుతున్నాయి.
Madan Mohan Rao Attack | ఎమ్మెల్యే పర్యటనలో ఉద్రిక్తత
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు పర్యటించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. గ్రామ పర్యటన సందర్భంగా కొందరు గ్రామస్థులు ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు, దాడికి యత్నించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి 13 మందిని అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు తరలించడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి మరికొందరి కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది.
Madan Mohan Rao Attack | పోలీసుల చర్యలపై ప్రశ్నలు
అయితే కేసు నమోదు, అరెస్టుల తీరుపై న్యాయస్థానంలో కీలక ప్రశ్నలు ఎదురయ్యాయి. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ ఎలా నమోదు చేశారన్న అంశాన్ని కోర్టు పరిశీలించినట్లు సమాచారం. కేసులో ప్రాథమికంగా ఆరోపణలకు తగిన వాస్తవాలు లేవన్న వాదనల నేపథ్యంలో అరెస్టైన 13 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
దీంతో ఎమ్మెల్యేపై దాడి యత్నం జరిగిందన్న పోలీసుల ఆరోపణలతో పాటు.. కేసు నమోదు చేసిన విధానంపై కూడా చర్చ మొదలైంది. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం రాజకీయంగా ఎమ్మెల్యే వర్గానికి ఎదురుదెబ్బగా ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు.
Madan Mohan Rao Attack | దాడి యత్నమా? రాజకీయ కక్ష సాధింపా?
ఈ ఘటన ఇప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది. ఎమ్మెల్యేపై దాడికి యత్నించడం తీవ్రమైన అంశమని అధికార వర్గాలు చెబుతుండగా.. అరెస్టులు రాజకీయ ఒత్తిడితో జరిగాయన్న ఆరోపణలు మరోవైపు వినిపిస్తున్నాయి.
ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై కోర్టులో ప్రశ్నలు రావడం, అనంతరం 13 మందికి బెయిల్ మంజూరు కావడం.. ఈ వ్యవహారంపై మరిన్ని సందేహాలకు తావిస్తోంది. అసలు మల్కాపూర్‌లో ఏం జరిగింది? ఎమ్మెల్యేపై నిజంగానే దాడికి యత్నించారా? లేక స్థానిక వివాదానికి రాజకీయ రంగు పులుముకున్నదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Harish Rao Ponguleti Criticism | పొంగులేటి కాదు.. పొంగులూటీ : హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు
మొత్తంగా మల్కాపూర్ ఘటన ఎల్లారెడ్డి రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరతీసింది. ఒకవైపు ఎమ్మెల్యే భద్రతపై ప్రశ్నలు, మరోవైపు అరెస్టులు–ఎఫ్‌ఐఆర్ నమోదుపై న్యాయపరమైన ప్రశ్నలు.. ఈ రెండు అంశాలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి.