Gandhari temple theft | గాంధారిలో దొంగల బీభత్సం.. రెండు ఆలయాల్లో చోరీలు

గాంధారి మండలంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు.

shashi kiran Mottala

అక్షరటుడే, గాంధారి: Gandhari temple theft | గాంధారి (Gandhari) మండలంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారు.

Gandhari temple theft | పెద్ద పోతంగల్​ జీపీ పరిధిలోని..

పెద్ద పోతంగల్ గ్రామ పంచాయతీ పరిధిలోని బుగ్గగండి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు రెండు హుండీలను ధ్వంసం చేశారు. అందులో నుంచి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఎన్నోఏళ్ల చరిత్ర కలిగి ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో లింగంతో కొలువైన ఈ ఆలయానికి విశిష్ట ప్రత్యేకత ఉంది. అయితే పాతగుడి కొత్తగుడి రెండింట్లోనూ హుండీలు ఏర్పాటు చేశారు. ప్రతిఏటా శ్రావణమాసం చివరి సోమవారం ఈ హుండీల్లో డబ్బులు లెక్కించి తిరిగి హుండీల్లోనే ఉంచారు. అయితే దాదాపు రూ.50వేలకు పైగా డబ్బు ఉంటుందని గ్రామస్తులు వెల్లడించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ఫోక్ బీట్‌కు అనిరుధ్ మాస్ టచ్.. నాని–కీర్తి సురేష్ స్టెప్పులతో ‘యేష నాగుల’ వచ్చేసింది..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *