Sajjala Comments | అటెన్షన్ కోసమే విజయ సాయిరెడ్డి ఆరోపణలు : సజ్జల

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్​ ఇచ్చారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sajjala Comments | మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ (YCP) నేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్​ ఇచ్చారు. అటెన్షన్ కోసమే ఆయన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

విజయ సాయిరెడ్డి (Vijay Sai Reddy) ఇటీవల మాట్లాడుతూ.. జగన్​ మత మార్పిడులను ప్రోత్సహించారని ఆరోపించారు. అంతేగాకుండా సజ్జలపై సైతం విమర్శలు చేశారు. పార్టీలో నంబర్​ 1 సజ్జల అయితే నంబర్​ 2 జగన్ అన్నారు. ఆయన వ్యాఖ్యలకు తాజాగా సజ్జల స్పందించారు. విజయసాయి సొంత కారణాలతో పార్టీ నుంచి బయటకు వెళ్లారని చెప్పారు. పార్టీ వీడిన వారిపై జగన్ నెగిటివ్‌గా మాట్లాడలేదన్నారు. తమను టార్గెట్ చేస్తే రియాక్షన్ గట్టిగా ఉంటుందని హెచ్చరించారు.

Sajjala Comments | సొంత పార్టీ పెట్టుకోవడానికి..

జగన్ (YS Jagan) మతమార్పిడిలు ప్రోత్సహించారని ఆరోపించడం దారుణమని సజ్జల అన్నారు. నిజంగా అలా చేసి ఉంటే విజయసాయినే మార్చేవాళ్లు అని పేర్కొన్నారు. కొందరు వ్యక్తిత్వ హననం చేస్తుంటారని మండిపడ్డారు. వైఎస్ జగన్ నాయకత్వాన్ని టార్గెట్ చేసి దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో మార్పు తెచ్చింది జగనే అన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే జగన్, వైసీపీపై విమర్శలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విజయ సాయిరెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం కోసం జగన్​ విమర్శించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

Sajjala Comments | ఆయనను పట్టించుకోవద్దు

తనపై కేసులు పెట్టడానికి అప్పట్లో రాజకీయాల్లో లేనని సజ్జల పేర్కొన్నారు. 2024 తర్వాత తప్పుడు కేసుల్లో అంతా అరెస్ట్ అయ్యారని తెలిపారు. కానీ విజయసాయి ఎలా తప్పించుకున్నారని ప్రశ్నించారు. విజయసాయి ఆరోపణలను ఇకపై పట్టించుకోనని తెలిపారు. పార్టీ నేతలు కూడా పట్టించుకోవద్దని సూచించారు. ఆయన తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

 

దీనిని కూడా చదవండి : Messi Event Refund | ఆ డబ్బులు రీఫండ్​ చేస్తాం.. బెంగాల్ సీఎం కీలక నిర్ణయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *