అక్షరటుడే, బోధన్ : Kaldurki bus protest | కళాశాలలు, పాఠశాలలకు వెళ్లేందుకు సరిపడా బస్సులు లేవని నిరసిస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ ఘటన బోధన్ (Bodhan) మండలం కల్దుర్కి గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
Kaldurki bus protest | బోధన్ మండలం కల్దుర్కిలో..
బోధన్ మండలం కల్దుర్కి గ్రామానికి సరిపడా బస్సులు నడపడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాల విద్యార్థులు సోమవారం వచ్చిన బస్సును ఆపి దాని ఎదుట ధర్నా చేశారు. సరిపడా బస్సులు రాకపోవడంతో నిత్యం కళాశాలలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని వారు వాపోయారు. అదనపు బస్సులు కేటాయించాలని ఎన్నిసార్లు బోధన్ డిపో మేనేజర్‌ను కలసి వినతిపత్రం అందించినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా డిపో మేనేజర్ స్పందించి అదనపు బస్సులు కేటాయించకపోతే గ్రామంలోనికి ఆర్టీసీ బస్సులు రానివ్వమని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Ayyappa Irumudi | రవితేజ ఇరుముడి..అసలు అయ్యప్ప భక్తుల ఇరుముడి వెనుక ఇంత మహత్యమా!