Owaisi Comments | హిందూ చట్టాన్ని రుద్దుతున్నారు : అసదుద్దీన్​ ఒవైసీ

ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Owaisi Comments | న్యూయార్క్‌ పర్యటనలో ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. మోహన్ భగవత్ మాటలు ఆర్‌ఎస్‌ఎస్ అనుసరించే పాత వ్యూహంలో భాగమే అన్నారు.

న్యూయార్క్​ పర్యటనలో ఉన్న ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ ఇటీవల మాట్లాడుతూ.. ముస్లింలు భారత్​లో ఉండొద్దు అనుకునేవారు అసలు హిందువులే కాదన్నారు. హిందూ రాష్ట్రం అంటే ముస్లింలు లేని దేశం కాదని వ్యాఖ్యానించారు. తాజాగా వీటిపై ఒవైసీ (Asaduddin Owaisi) స్పందించారు. బయటి ప్రపంచం కోసం ఆర్​ఎస్​ఎస్​ నాయకులు చేసే ప్రసంగాలకు, తమ సొంత సభ్యుల కోసం చేసే ప్రసంగాలకు మధ్య తేడా ఉంటుందని ఆరోపించారు. దేశంలో UCC (ఉమ్మడి పౌర స్మృతి) ముసుగులో హిందూ చట్టాన్ని రుద్దుతున్నారని పేర్కొన్నారు. ఇది కూడా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలమే అన్నారు. ఇదంతా జరుగుతుండగా.. మత సామరస్యం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.

Owaisi Comments | స్వాతంత్ర్యం కోసం పోరాడలేదు

దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆర్​ఎస్​ఎస్​ పాల్గొనలేదని ఒవైసీ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడైన హెడ్గేవార్ మొదట్లో కాంగ్రెస్‌లో ఉండేవారని గుర్తు చేశారు. అన్ని మత వర్గాలను ఏకం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలని గాంధీ భావించడంతో ఆయన కాంగ్రెస్​ నుంచి బయటకు వచ్చారని ఆరోపించారు. దేశంలో క్రైస్తవులు తమ విశ్వాసం విషయంలో అణచివేతకు గురవుతున్నారని ఒవైసీ అన్నారు.

ఇది కూడా చదవండి..: Ankit Baliyan Murder Case | సింగర్​ హత్య కేసు.. నిందితులను ఎన్​కౌంటర్​ చేసిన పోలీసులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *