Kavitha Nizamabad Visit | జిల్లాకు చేరుకున్న టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇందూరుకు చేరుకున్నారు. ఆమె పాంచజన్య సభలో ప్రసంగించనున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ: Kavitha Nizamabad Visit | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఇందూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బైక్​ర్యాలీ నిర్వహించారు.

Kavitha Nizamabad Visit | ఓల్డ్​ కలెక్టరేట్​ గ్రౌండ్​లో బహిరంగ సభ..

మాధవనగర్​ నుంచి ప్రారంభమైన బైక్​ ర్యాలీ కలెక్టరేట్​ వరకు సాగింది. నగరంలోని ఓల్డ్​ కలెక్టరేట్​ గ్రౌండ్​లో బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా టీఆర్​ఎస్​ శ్రేణులు భారీ ఎత్తున జనసమీకరణ చేశారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తామని కవిత గతంలో పేర్కొన్నారు. ‘పాంచజన్యం’ పేరుతో ఐదు పథకాలను ఆమె ఇందూరు వేదికగా ప్రకటించనున్నారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Police Promotions | పలువురు హెడ్​కానిస్టేబుళ్లకు పదోన్నతులు.. అభినందించిన సీపీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *