Bhubharati Passbooks | అబద్ధాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు: హరీశ్ రావుకు పొంగులేటి కౌంటర్

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించి, 780 మంది రైతులకు భూభారతి (భూఆధార్) పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bhubharati Passbooks | మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  ( Ponguleti Srinivas Reddy )పర్యటించి, 780 మంది రైతులకు భూభారతి (భూఆధార్) పాస్‌బుక్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పాలనపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రులు ఎప్పుడైనా ప్రజలను కలిశారా అని ప్రశ్నించారు.

Bhubharati Passbooks | రైతులకు పాస్‌బుక్‌ల పంపిణీ..

భూభారతి ద్వారా రైతుల కష్టాలు తీర్చామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. కేసముద్రం మండలం నారాయణపురంలో నూతన భూఆధార్ పాస్‌బుక్‌లను రైతులకు అందజేసి, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామం లేదన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రస్తుతం తమ ప్రభుత్వం పూర్తి చేసి ప్రజలకు పంపిణీ చేస్తోందని తెలిపారు.

Bhubharati Passbooks | బీఆర్ఎస్ నేతల తీరుపై తీవ్ర విమర్శలు..

హరీశ్ రావు చేస్తున్న కుట్రలను, అబద్ధపు ప్రచారాలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ని అబద్ధాలు ఆడినా, తలకిందులుగా తపస్సు చేసినా, తడిబట్టలతో దేవుళ్ల చుట్టూ పొర్లు దండాలు పెట్టినా తెలంగాణ ప్రజలు దొరపాలనను అంగీకరించబోరని మండిపడ్డారు. ముఖ్యంగా కేసీఆర్, హరీశ్ రావుల అబద్ధాలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Chicken Pieces Dispute | చికెన్​ ముక్కలు ఎక్కువ తిన్నాడని స్నేహితుడి హత్య

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *