అక్షరటుడే, కామారెడ్డి: PM Shri School Scam | మద్నూర్ (Madnur) పీఎంశ్రీ పాఠశాలలో నైట్ వాచ్‌మన్ ఒకరికి బదులుగా మరొకరు విధులు నిర్వర్తిస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ ఇన్‌ఛార్జి జాధవ్ ఈశ్వర్ ఆరోపించారు. సోమవారం ఆయన డీఈవో మల్లికార్జున్‌కు కలిసి ఫిర్యాదు చేశారు.
PM Shri School Scam | విధులకు రాకుండా..
పీఎంశ్రీ పాఠశాలలో నర్సింహాస్వామి అనే వ్యక్తి నైట్ వాచ్‌మన్‌గా ఉన్నారన్నారు. అయితే ఆయన స్థానంలో సురేష్ అనే వ్యక్తిని నియమించుకుని ప్రభుత్వం నుంచి సుమారు రూ.70వేల వరకు పొందుతున్నారని తెలిపారు. నర్సింహాస్వామి అనే వ్యక్తి గత రెండేళ్లుగా విధులకు హాజరు కావడం లేదన్నారు. సురేష్ అనే వ్యక్తికి రూ.5 నుంచి 6 వేలు ఇచ్చి అతనికే ఫేస్ రికగ్నేషన్ కూడా చేయించారన్నారు. సురేష్ అనే వ్యక్తి నర్సింహస్వామిగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. వచ్చే వేతనానికి మాత్రం నర్సింహ స్వామి అకౌంట్ ఉందని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగం చేయాల్సిన వ్యక్తి అతని స్థానంలో మరొకరిని విధులు చేపిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సంబంధిత అంశానికి సంబంధించి పూర్తి ఆధారాలతో డీఈవోకు ఫిర్యాదు చేశానని, తన దృష్టికి రాలేదని తెలిపారన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే డీఈఓ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజ్ పాల్, శ్రీనివాస్ ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Kavitha Nizamabad Visit | జిల్లాకు చేరుకున్న టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత