అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Auto Driver Attack | ఓ ఆటోడ్రైవర్ ఇద్దరిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరం (Nizamabad)లోని వర్నీ రోడ్ చౌరస్తాలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.
Auto Driver Attack | ఆటోలో వస్తువుల కోసం..
రెండో టౌన్ ఎస్‌హెచ్‌వో యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మాధవనగర్‌కు చెందిన ఆదిత్య, గణేష్‌లకు నక్క నవీన్ అనే వ్యక్తి స్నేహితుడు. అయితే నక్క నవీన్ ఇటీవల ఆటోను రిపేర్ చేయించాడు. అందులోని వస్తువులు తనకు ఇవ్వాలని నవీన్‌ను గణేష్ కోరాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన నవీన్ గణేష్‌పై కత్తితో వీపులో దాడి చేశాడు. అడ్డు వచ్చిన ఆదిత్యపై సైతం దాడి చేశాడు. దీంతో అతడి చేతులపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని జీజీహెచ్‌కు తరలించారు. దాడిచేసిన నవీన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: SIR Notices | ఎస్ఐఆర్ ఎఫెక్ట్.. ప్రముఖులకు నోటీసులు