Eatala Rajender | రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు : ఎంపీ ఈటల

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బీజేపీ ఈటల రాజేందర్​ అన్నారు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Eatala Rajender | తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని బీజేపీ ఈటల రాజేందర్​ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని అణచివేతలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

నల్గొండ జిల్లా (Nalgonda District) బీజేపీ అధ్యక్షుడు9 డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై, ఆయన తల్లి నివాసంపై నిన్న కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు. ఆ దాడిని ఎంపీ ఖండించారు. అక్రమ దాడులను ప్రశ్నించడానికి, బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​ రావును పోలీసులు అరెస్ట్ చేయడం ప్రభుత్వ భయానికి, నిరంకుశత్వానికి నిదర్శనం అన్నారు.

Eatala Rajender | ప్రజలు తిరగబడతారు

ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తే రాష్ట్ర ప్రజలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. దాడులు చేసిన అధికార పార్టీ మూకలను వదిలేసి, బాధితులకు అండగా నిలవాలనుకునే నాయకులను నిర్బంధించడం ప్రభుత్వ వైఫల్యానికి పరాకాష్ట అన్నారు. బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు.

Eatala Rajender | పోరాడుతూనే ఉంటాం

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని ఈటల ఖండించారు. కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపై ఇలాంటి దాడులకు దిగడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ నిత్యం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నామనే కక్షతోనే బీజేపీ కార్యాలయంపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

ఇది కూడా చదవండి..: Ranganath HYDRA Commissioner | సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్.. హైకోర్ట్‌ను ఆశ్రయించిన రంగనాథ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *