Single Use Plastic Ban | సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై బల్దియా ఉక్కుపాదం

పట్టణంలో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Single Use Plastic Ban | పట్టణంలో(Bheemgal Municipality) నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై మున్సిపల్ అధికారులు శనివారం దాడులు చేపట్టారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బందితో కలిసి పట్టణంలోని పలు వ్యాపార సముదాయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

Single Use Plastic Ban | నిబంధనలకు విరుద్ధంగా..

నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు వినియోగిస్తున్న పలువురు వ్యాపారులను గుర్తించి, వారి నుంచి నిషేధిత ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడికక్కడే జరిమానాలు విధించారు. మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ.. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు. హోటళ్లు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కిరాణా దుకాణాల నిర్వాహకులు ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ స్థానంలో పర్యావరణహితమైన సంచులను అందుబాటులోకి తేవాలన్నారు. రాబోయే రోజుల్లోనూ ఈ తనిఖీలు తీవ్రతరం చేస్తామని, నిషేధిత ప్లాస్టిక్ వాడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: కవిత ఆరోపణలపై ప్రశాంత్ రెడ్డి కౌంటర్ 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *