Hyderabad Global Knowledge Hub | హైదరాబాద్‌లో గ్లోబల్ విద్యా సంస్థల క్యాంపస్‌లు.. సీఎం రేవంత్ రెడ్డి హర్షం

హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి 'గ్లోబల్ నాలెడ్జ్ హబ్'గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రఖ్యాత విద్యాసంస్థల నుంచి విశేష స్పందన లభిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Global Knowledge Hub | హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రఖ్యాత విద్యాసంస్థల నుంచి విశేష స్పందన లభిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ( Revanth Reddy ) హర్షం వ్యక్తం చేశారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా బ్రిటన్‌కు చెందిన ‘యూనివర్సిటీ ఆఫ్ లండన్’, అమెరికాలోని ‘నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ’లు తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు ముందుకొచ్చాయని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. వీటితో పాటు ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ, దాని అనుబంధ సంస్థలు కూడా రాష్ట్రంలో ప్రత్యేక కోర్సులు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.

Hyderabad Global Knowledge Hub | ప్రపంచ స్థాయి విద్య..

తమ విదేశీ పర్యటనలో భాగంగా ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) వంటి పలు అంతర్జాతీయ విద్యా సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయని సీఎం వివరించారు. అలాగే అమెరికాలోని ఎంఐటీ సహా పలు ఐవీ లీగ్ సంస్థలతో సమావేశాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయన్నారు. ఈ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణ యువతకు హైదరాబాద్‌లోనే ప్రపంచ స్థాయి విద్య, నైపుణ్యాలు అందుబాటులోకి వస్తాయని, తెలంగాణను అంతర్జాతీయ విద్యా రాజధానిగా మార్చడమే తమ సంకల్పమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం

ఇది కూడా చదవండి: Sneha Society Services | స్నేహా సొసైటీ సేవలు అభినందనీయం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *