Srivari Temple ACB Searches | శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు

తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేనపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Srivari Temple ACB Searches | తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేనపట్టారు. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. దీంతో బుధవారం ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు చేస్తున్నారు.

తిరుపతి (Tirupati)లోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న లోకనాథం ఇంటితో పాటు ఆయన బంధవులు ఇళ్లలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 5 ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. తిరుపతిలోని లోకనాథం ఇద్దరు బావమరుదుల ఇళ్లలో, తిరుమలలోని లోకనాథం ఆఫీసులో, ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు.

Srivari Temple ACB Searches | అనేక ఆరోపణలు

డిప్యూటీ ఈవో లోకనాథం భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. విలువైన దస్తావేజులు, స్థిర, చరాస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్లు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఏసీబీ దాడులతో టీటీడీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. కాగా తనిఖీలు పూర్తయ్యాక అధికారులు వివరాలు వెల్లడించనున్నారు.

ఇది కూడా చదవండి..: Kalyan Jewellers Rajahmundry | రాజమండ్రిలో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త షోరూమ్.. గ్రాండ్‌గా ఓపెన్ చేసిన నాగార్జున ..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *