Konda Surekha Dismissal | తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్..

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Konda Surekha Dismissal | తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రివర్గం నుంచి మంత్రి కొండా సురేఖను తక్షణమే తొలగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కొండా సురేఖను కేబినెట్ నుంచి తక్షణమే తప్పించాలని కోరుతూ ప్రభుత్వ సిఫార్సును ఇప్పటికే గవర్నర్‌కు పంపించారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని నూతన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ సీఎం ఉత్తర్వులు జారీ చేశారు.

Konda Surekha Dismissal | పలు కీలక పదవుల భర్తీ..

ఈ మార్పులతో పాటు రాష్ట్రంలోని పలు కీలక పదవులకు నియామకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను నియమించారు. అలాగే, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణి నియామకానికి సీఎం ఆమోదం తెలిపారు. ఒకేసారి కేబినెట్ ప్రక్షాళనతో పాటు ముఖ్యమైన కార్పొరేషన్లు, కమిషన్లలో కొత్త నియామకాలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి..: TG Transco Warning | టీజీ ట్రాన్స్‌కో సీరియస్ వార్నింగ్.. అంతర్గత విషయాలు బయటకు చెబితే కఠిన చర్యలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *