అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Forest Beat Officer Bribe | అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) చేపడుతున్నా.. భయపడకుండా లంచాలు తీసుకుంటున్నారు. ఏసీబీకి చిక్కిన కఠిన చర్యలు లేకపోవడంతో లంచాలకు మరిగిన అధికారులు ప్రజల నుంచి ప్రతి పనికి పైసలు వసూలు చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అలపల్లి మండలంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. అలపల్లి మండలం, కచనపల్లి బీట్ ఆఫీసర్‌గా బానోత్ రవికుమార్ పనిచేస్తున్నాడు. ఆయన రామానుజగూడెం బీట్ ఇన్‌చార్జిగా కూడా కొనసాగుతున్నాడు. ఓ వ్యక్తికి సంబంధించి పోడు సాగుకు ఆటంకం కలిగించకుండా, కందకాలు తవ్వడం వంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు బీట్ ఆఫీసర్ రూ.30 వేల లంచం డిమాండ్ చేశారు.
Forest Beat Officer Bribe | పోడు పట్టాలు వస్తాయని..
అటవీ భూమిని కాపాడాల్సిన బీట్ అధికారి రైతు నుంచి డబ్బులు అడిగాడు. పైసలు ఇస్తే అడవులను నరికినా ఏం అనమని హామీ ఇచ్చాడు. రూ.30 వేలు ఇస్తే భవిష్యత్‌లో ఆ భూమికి పట్టాలు కూడా వస్తాయని చెప్పాడు. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు గురువారం బీట్ ఆఫీసర్ రవికుమార్ రూ.30 వేల లంచం సొమ్మును పటన్ సాదిక్ ఖాన్ అనే వ్యక్తికి అందించాలని సూచించారు. అనంతరం అతడి నుంచి తాను తీసుకుంటానని చెప్పాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి సాదిక్ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీట్ ఆఫీసర్‌తో పాటు అతడిని కూడా అరెస్ట్ చేశారు.
దీనిని కూడా చదవండి : CM Revanth Reddy | దేశభక్తిలో అమిత్ షా, మోదీకి ఒవైసీ తక్కువేమీ కాదు : సీఎం రేవంత్ రెడ్డి