Arvind Dharmapuri | ఫారిన్ కాంట్రిబ్యూషన్ అమెండ్మెంట్ బిల్ జాయింట్ కమిటీ సభ్యుడిగా అర్వింద్ ధర్మపురి

దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రత, పారదర్శకత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని బిల్లుపై జాయింట్ కమిటీలో సమగ్రంగా చర్చిస్తానని అర్వింద్ ధర్మపురి తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Arvind Dharmapuri | ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్మెంట్ బిల్, 2026పై ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీలో నిజామాబాద్ Nizamabad ఎంపీ అర్వింద్ ధర్మపురి సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం లోక్‌సభ విడుదల చేసిన అధికారిక బులెటిన్‌లో జాయింట్ కమిటీ సభ్యుల జాబితాలో అర్వింద్ ధర్మపురి పేరు నమోదైంది.

ఈ జాయింట్ కమిటీలో లోక్‌సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 31 మంది సభ్యులు ఉన్నారు. ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) అమెండ్మెంట్ బిల్, 2026కు సంబంధించిన అంశాలను కమిటీ పరిశీలించి, సభ్యుల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోనుంది.

Arvind Dharmapuri | సమగ్రంగా చర్చిస్తా..

కమిటీలో సభ్యుడిగా నియమితులైన సందర్భంగా అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కీలకమైన బాధ్యతను నిర్వర్తించే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు.

Telangana Congress BC Politics | క్రమశిక్షణ పేరిట వర్గ సమరం.. తెలంగాణ కాంగ్రెస్‌లో భిన్న తీరు.. కొండా బర్తరఫ్​పై బీసీ వర్గాల నిరసన

దేశ ప్రయోజనాలు, జాతీయ భద్రత, పారదర్శకత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని బిల్లుపై జాయింట్ కమిటీలో సమగ్రంగా చర్చిస్తానని అర్వింద్ ధర్మపురి తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కృషి చేస్తానన్నారు.

నిజామాబాద్ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్లమెంటులో ప్రజా సమస్యలతో పాటు దేశ ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంపై మరింత బాధ్యతతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *