Delhi Hostel Collapse | ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్​.. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులు

ఢిల్లీలో ఓ హాస్టల్ భవనం ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Hostel Collapse | ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ హాస్టల్ భవనం ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అందులోని విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నారు.

నైరుతి ఢిల్లీలోని సత్య నికేతన్ సమీపంలో ఆరు అంతస్తుల హాస్టల్ భవనం కూలిపోయింది. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు సైతం శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురిని భవనం నుంచి రక్షించగా, మిగతా వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఎంత మంది చిక్కుకున్నారనే వివరాలు తెలియరాలేదు.

 Delhi Hostel Collapse | ఆదివారం కావడంతో..

కూలిపోయిన భవనం పేరు ‘హాస్టల్ డేజ్’ (Hostel Days). ఇది అబ్బాయిల కోసం ఉద్దేశించిన ఒక పీజీ (PG) వసతి గృహం. ఆదివారం సెలవు రోజు కావడంతో చాలా మంది బయటకు వెళ్లకుండా హాస్టల్​లోనే  ఉన్నారు. ఈ సమయంలో భవనం కూలింది. దీంతో పాటు పక్కనే ఉన్న మరో భవనం సైతం కూలిపోయింది. దాదాపు 50 మంది లోపల ఉన్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ప్రజలను బయటకు తీయడానికి కృషి చేస్తున్నాయి. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు.

 Delhi Hostel Collapse | లోపలి నుంచి ఫోన్​ కాల్స్​

అధికారులు 12 అగ్నిమాపక వాహనాలను ఘటనా స్థలానికి పంపించారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే ఒక ఎక్స్‌కవేటర్‌ను రంగంలోకి దించారు. శిథిలాలను తొలగిస్తూ.. లోపల చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. విపత్తు సహాయక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అనిల్ శర్మ ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్ఆనరు. కొంతమంది విద్యార్థులు లోపలి నుంచే ఫోన్లు చేస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

 Delhi Hostel Collapse | బాధితులకు అండగా ఉంటాం

భవనం కూలిపోవడం పట్ల తాను తీవ్ర ఆందోళన చెందుతున్నానని, సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి రేఖా గుప్తా (CM Rekha Gupta) తెలిపారు. ముందు జాగ్రత్తగా అధికారులు పక్కన ఉన్న మరో భవనాన్ని ఖాళీ చేయించారు. బాధితులైన కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని సీఎం తెలిపారు.

 

ఇది కూడా చదవండి : Nizamabad Child Kidnapping | బాలుడి కిడ్నాప్​ కథ సుఖాంతం.. కిలాడి లేడి ఆట కట్టించిన పోలీసులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *