BRS Assembly Protest | పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు

తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజే తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: BRS Assembly Protest | తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల ప్రారంభ రోజే తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలను, ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ఎల్పీ నేతలు నల్ల టీషర్టులు ధరించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో అసెంబ్లీ వైపు వెళ్తున్న కేటీఆర్, హరీశ్‌రావుతో (Harish Rao )పాటు పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. గన్‌పార్క్‌ వద్ద శాంతియుతంగా ఆందోళన తెలుపుతున్న మహిళా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకుల పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని పార్టీ శ్రేణులు మండిపడ్డాయి.

BRS Assembly Protest | నలువైపులా ఆందోళనలు..

మరోవైపు ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలుపుతూ బీజేపీ నేతలు కూడా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రాజకీయ గందరగోళం, నిరసనల నడుమ తెలంగాణ శాసనసభ సమావేశాలు వాయిదా పడ్డాయి. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కాలరాస్తూ ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని నియంత పాలన సాగిస్తోందని బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. పోలీసుల అణచివేత చర్యలను ఖండిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన దీక్షలు, భారీ ధర్నాలు చేపట్టి ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది.

ఇది కూడా చదవండి: Dharmapuri Temple | ధర్మపురి ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *