అక్షరటుడే, డొంకేశ్వర్: Wild Boar Accident | బైక్‌కు అడవి పంది అడ్డు రాగా అదుపు తప్పి కిందపడి లిఫ్ట్ ఇరిగేషన్ (Lift Irrigation Operator) పంప్‌హౌస్ ఆపరేటర్ మృతి చెందాడు. ఈ ఘటన మారంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్‌హౌస్ సమీపంలో చోటు చేసుకుంది.
Wild Boar Accident | మారంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్‌హౌస్ వద్ద..
ఎస్సై వినయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. డొంకేశ్వర్ (Donkeshwar) మండల పరిధిలోని గంగా సముందర్ అనే గ్రామానికి చెందిన సాకలి ఉస్సన్న (45) ఎనిమిది నెలలుగా మారంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ వద్ద ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే తన బైక్‌పై పంప్ హౌస్‌కు వెళ్లాడు. సోమవారం సాయంత్రం 4 గంటలకు డ్యూటీ అయిపోగానే తిరిగి ఇంటికి వస్తుండగా లిఫ్ట్ రోడ్డు గుట్ట ప్రాంతంలో ఎదురుగా అడవి పంది అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పి మట్టి రోడ్డుపై కింద పడిపోయాడు.
ఈ ప్రమాదంలో ముఖానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తుడు మైస సంతోష్ ఇచ్చిన సమాచారంతో మృతుడి మేనల్లుడు మేరా అనిల్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుర్తించాడు. అనిల్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన బిగ్ బాస్ 10 సీజన్ మొదలైంది.