అక్షరటుడే, వెబ్‌డెస్క్: TRESA State President | తెలంగాణ Telangana రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA) నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కె. గౌతమ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎల్. రమణ్ రెడ్డిని నిజామాబాద్‌లోని రెవెన్యూ భవన్‌లో రెవెన్యూ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.
Bihar SUV Rooftop | దొంగల భయం.. ఏకంగా ఇంటి పైకప్పుపైకి SUV.. బిహార్‌లో ఘటన
ఈ సందర్భంగా ఉద్యోగులు నూతన రాష్ట్ర నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వంలో TRESA మరింత బలోపేతం కావడంతో పాటు రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా కృషి జరగాలని ఆకాంక్షించారు.
TRESA State President | ఓర్పుతో పోరాడే యువ నాయకుడు..
కార్యక్రమంలో మాట్లాడిన కె. గౌతమ్ కుమార్.. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు TRESA నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఎల్. రమణ్ రెడ్డి నిబద్ధతతో పనిచేసే నాయకుడని, ఉద్యోగుల సమస్యలపై ఓర్పుతో పోరాడే యువ నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.
నూతన నాయకత్వంలో ఉద్యోగుల చిరకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని రెవెన్యూ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు.
TRESA State President | ఉత్సాహభరిత వాతావరణంలో..
ఉద్యోగుల ఐక్యతను చాటుతూ ఉత్సాహభరిత వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బోధన్ డివిజన్, ఆర్మూర్, కలెక్టరేట్, GPOల సంఘాల ప్రతినిధులు, అలాగే జిల్లాలోని పలువురు రెవెన్యూ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన రాష్ట్ర నాయకత్వానికి అభినందనలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రావు, కోశాధికారి విజయ్ కాంత్ రావు, వైస్ ప్రెసిడెంట్లు భూపతి ప్రభు, వినయ్ సాగర్‌తో పాటు పలువురు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.