అక్షరటుడే, వెబ్‌డెస్క్: Assembly Sessions | తమ పార్టీ మహిళా నాయకురాళ్లకు జరిగిన అవమానానికి రేవంత్ రెడ్డి కచ్చితంగా అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ 420 హామీలు, 1000 రోజుల పాలనపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ అన్నారు. ఇవన్నీ చర్చకు రాకుండా తప్పించుకోడానికి చిల్లర డ్రామాలు చేస్తున్నారని మండి పడ్డారు. తాము దాడి చేయలేదని, తమపై, నాయకురాళ్ల పైన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దాడి చేశారని ఆరోపించారు. వారికి జరిగిన అవమానంపై శాసనసభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పిట్ట బెదిరింపులకు, భయపడేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరన్నారు.
Assembly Sessions | అసెంబ్లీలో నిరసన
రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలు ధరించి సభకు హాజరు అయ్యారు. అసెంబ్లీలో నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. గౌరవ సభను కౌరవ సభ చేస్తారా అని ఆందోళన చేపట్టారు. మరోవైపు నిన్న బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకోవడమే కాకుండా మహిళా శాసనసభ్యులపై అసభ్య ప్రవర్తన, భౌతిక దాడులకు దిగిన ఘటనపై చర్చించాలని వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టారు.
ఇది కూడా చదవండి..: KTR Harish Rao Cases | అసెంబ్లీ ఎదుట రభస.. కేటీఆర్, హరీష్ రావు సహా 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు